ఉద్ధానం సమస్యపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం 10వ రోజు

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం జనసేన పార్టీ తరఫున ఇంచార్జ్ దాసరాజు ఆధ్వర్యంలో ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు జరుగుతున్న లక్ష సంతకాల సేకరణ 10వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం కవిటి మండల హెడ్ క్వార్టర్స్ లో గ్రామ దేవత శ్రీ చింతామణి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు నేతృత్వంలో జనసేన నాయకులు, జనసైనికులు కవిటి, కొత్తూరు గ్రామాలలో ప్రతి ఇంటికి మరియు షాపులకి వెళ్లి కిడ్నీ సమస్య తీవ్రతను వివరించి లక్ష సంతక సేకరణ ముఖ్య ఉద్దేశ్యంను ప్రజలకు తెలియజేస్తూ వారి వద్ద నుండి సంతకాలు సేకరించారు. శనివారం ఈ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమంలో సుమారు 2000 పైగా సంతకాలు సేకరించడం జరిగింది. కొంతమంది కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాధితులు తమ గోడును జనసేన నాయకులకు తెలియజేసి, కిడ్నీ సమస్యపై పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, రామకృష్ణ, ప్రవీణ్ బెహరా, రాజశేఖర్, ఈశ్వర్ ధనుంజయం, హేమా చలపతి, డి.రాజు, సతీష్, ఇ.రాజు, జగదీష్, నవీన్,
చలపతి, బి.ప్రవీణ్, గిరి బెహరా, మురళి, రాజు, దేవ, మోహన్, సంతోష్, వాసు దేవ్, తడక రాజు, సంజు రౌలో
పరశురామ్, త్రినాధ్, పండు, గబ్బర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.