ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 10వ రోజు

ఆత్మకూరు నియోజకవర్గం, పారిశ్రామికంగా ప్రగతి బాటన నడవాలన్నా, ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా, జనసేన పార్టీకి ఓటేసి గెలిపించాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం మంగళవారం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములు అయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతి దాదాపు శూన్యమే అని, ఆత్మకూరు సమీపంలోని నారంపేట పారిశ్రామిక వాడలో ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసిన సెంచరీ ప్లైవుడ్ కర్మాగారము ముఖ్యమంత్రి సొంత జిల్లాకి తరలించడం ఎంతో శోచనీయమన్నారు. ఈ కర్మాగారం ఏర్పడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశపడిన ఈ ప్రాంత యువతకు ఇది శరాఘాతం అన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆత్మకూరు పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పవనన్న ప్రజా బాట సందర్భంగా స్థానిక ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆత్మకూరు మున్సిపాలిటీలో ఆహ్లాదకరమైన పార్కులు నిర్మిస్తామని, నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మినీ స్టేడియంను వెంటనే పూర్తి చేస్తామని, సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, ధనుష్, సుధాకర్, పవన్, మస్తాన్ వలి, దినేష్, శ్రీహరి, అనిల్, భాను, శీను, రాజేష్, నాగేంద్రబాబు, శ్రీకాంత్, ప్రవీణ్, హజరత్ పాల్గొన్నారు.