నరకాసురుని పాలనకు అంతం పలికి జనసేన-టీడీపీలకు పట్టం కట్టండి: మలిశెట్టి వెంకటరమణ

  • నందలూరులో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి ఆధ్వర్యంలో విస్తృతంగా 118 రోజుల పవన్ అన్న ప్రజా బాట

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట నియోజకవర్గం నందలూరు గ్రామంలో 118 రోజుల పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన జెండాలతో గాజు గ్లాస్ గుర్తుతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి సమస్యలను అడిగి తెకుసుకున్నారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ రౌడీ, గుండా, నరకాసురుని పరి పాలనను పారద్రోలి పవన్ పిలుపు మేరకు జనససేన టీడీపీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఇంటిలో పవన్ కల్యాణ్ పై ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తున్నారని, ప్రజా బాటకు వారి స్పందన చూస్తే చాలా సంతోషం కలుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, వీరయ్య ఆచారి, గోపి, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, గోవర్ధన్, కిషోర్, వెంకటసుబ్బయ్య, జనసేన వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.