అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు జేఏసీ ఉద్యమం 2వ రోజు

  • నిరాహార దీక్షలు మొదలుపెట్టిన ప్రజా సంఘాల జేఏసీ ఐక్య వేదికకు మద్దతు తెలిపిన జనసేన!

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు జేఏసీ ఐక్య వేదిక 2వ రోజు చేపట్టిన రిలే నిరాహారదీక్ష కు మద్దతుగా శిబిరాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అలానే స్థానిక శాసనసభ్యుడు భారత రాజ్యాంగ పరంగా ప్రజలు చేత ఎన్నుకోబడి బాధ్యతలు మరచి ప్రతిపక్ష పార్టీల వారిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం సభ్యసమాజం సిగ్గుపడుతుందని ప్రశ్నించారు. అదేవిధంగా అంబెడ్కర్ గారి విగ్రహాన్ని తొలగించిన చోట తిరిగి ఏర్పాటు చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.