జనంకోసం జనసేన 274వ రోజు

జగ్గంపేట, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనంకోసం జనసేన 274వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం 300 దానిమ్మ మొక్కలు పంచడం జరిగింది. ఈ నాటికి మొత్తం 41000 దానిమ్మ మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి నుండి బంగారు రామస్వామి, నార్ల దిని నారాయణ, పసుపులేటి వెంకట సూర్యారావు, తోలాటి రాజు, రామకుర్తి బాలు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 273వ రోజు కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తోలాటి ఆదినారాయణ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.