జనంకోసం జనసేన 283వ రోజు

  • 600 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 283వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 600 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 46935 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల కార్యదర్శి పట్టెం మణి శ్రీనివాస్, తిరుమలాయపాలెం నుండి గ్రామ ఎంపిటిసి చెన్నంశెట్టి చక్రరావు, బత్తిన పాపయ్యరాజు (చిట్టిబాబు), ఉల్లి వీర మణికంఠ, కంచుమర్తి శ్రీను, కొలిమేను సురేష్, ఓమ్మి అప్పన్న, జుత్తిక మణికంఠ, గరగ పండు, మొల్లేటి అప్పన్న, కాకినాడ రాజేష్, షేక్ శివ, తిరుమలశెట్టి బాను, గోకవరం నుండి ఉంగరాల శివ, గవిని దుర్గాప్రసాద్, అంబటి శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.