బత్తుల ఆధ్వర్యంలో గణపతి, రుద్ర, చండీ, ఆయుష్షు, మహా మృత్యుంజయ యాగం 3వ రోజు

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యములుతో, అత్యున్నత పదవులతో దిన దినాభివృద్ధి చెందాలని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నుండి గురువారం వరకు గణపతి, రుద్ర, చండీ, ఆయుష్షు, మహా మృత్యుంజయ యాగం బుధవారం మూడవ రోజు వేద పండితుల మంత్రోశ్చాతారనతో ప్రారంభమైనది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజాసేవతో ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాల దృష్టుల మరియు శత్రుబాధలు తొలగి రాజ్యాధికారం పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రక్షించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ యాగాన్ని 30 మంది వేదపండితులతో రాజమండ్రి వారి స్వగృహం నందు 3వ రోజు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఘనంగా నిర్వహించారు.