జనసేన మహా సంకల్ప యాత్ర 4వ రోజు

అమలాపురం: జనసేన పార్టీ “ఒక్క అవకాశం” మహా సంకల్ప యాత్ర.. 4వ రోజు కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలో 27వ వార్డు ఆశనగర్ లో ప్రతీ ఇంటికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, మనోగతాలను వివరిస్తూ.. ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చేయబోయే వివిధ కార్యక్రమాలు, పేద ప్రజలకు చేయబోయే మంచి పనుల గురించి, అలాగే పవన్ కళ్యాణ్ ఇంతవరకు చేసిన మంచి పనులు ఉదార స్వభావంతో పేద కుటుంబాలకి మరియు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీ ఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని కోరడం జరిగింది. 27వ వార్డులో ఉన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉందని ఎన్ని సార్లు వార్డు కౌన్సిలర్ కి చెప్పినా, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు పండు, సీనియర్ నాయకులు కంచిపల్లి అబ్బులు, మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బట్టు పండు, నల్లా వెంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, సాదనాల మురళి, నల్లా చిన్న, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముళ్ళ బాబా, షరీఫ్, పోలిశెట్టి బాబులు, యాళ్ళ బిందాస్, పోలిశెట్టి మహేష్, వీరమహిళలు తిక్క సరస్వతి, కరాటఒ వాణి, వానపల్లి దేవి, తదితరులు పాల్గొన్నారు.