జనం కోసం జనసేన 562వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 562వ రోజు కార్యక్రమం శుక్రవారం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 94610 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 563వ రోజు కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంట వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. శుక్రవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు రామకుర్తి నరసింహ, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు (శ్రీను), గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, మల్లేపల్లి నుండి పంచకట్ల రామకృష్ణ, రామకుర్తి వీరబాబు, రామకుర్తి బుజ్జియ్య, దిడ్డి జగదీశ్వరరావు, దార్లంక సాయి, బత్తుల పెద్దకాపు, రామకుర్తి చక్రం, రామకుర్తి నాగేశ్వరరావు, గొల్లపల్లి విజయ్(పండు), తాళ్లూరు నుండి కల్తూరి వెంకన్న బాబు, ఆరుగొల్లు రామిరెడ్డి, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, బూరుగుపూడి నుండి పాటంశెట్టి చిన్న రామకృష్ణ, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.