ఇమ్మడి కాశీనాధ్ పాదయాత్ర 6వ రోజు

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర ఆరవ రోజు తర్లుపాడు గ్రామం నుండి బయలుదేరి బొడిచెర్ల, మిట్టమీదిపల్లి, తిప్పాయిపాలెం మరియు చింతగుంట్ల గ్రామాల వరకు చేరుకోవడం జరిగింది. ఈ పాదయాత్రకు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి షేక్ సైదా, సిపిఐ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు అందే నాసరయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు సుదర్శన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు దూదేకుల మస్తాన్, పటాన్ ఖాన్, మద్దతు తెలిపారు. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.