వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 8వ రోజు

• 8 రోజుల నుంచి పాదయాత్రగా 15 గ్రామాలు పూర్తి చేసుకోవడం జరిగింది.
• ప్రజల మధ్యలో ఉంటూ… ప్రజల సమస్యలు తెలుసుకుంటూ… నిత్యం ప్రజలతో మమేకమై వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర
• పాదయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించినటువంటి వట్టిపల్లి తండా గ్రామ గిరిజన సోదరులు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెల్కపల్లి మండలం, వట్టిపల్లి తండాలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 8వ రోజు నిర్వహించడం జరిగింది. వట్టిపల్లి తండాలో వంగ లక్ష్మణ్ గౌడ్ గడప గడపకు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఎం.డి మహబూబ్, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, కొడిగంటి సాయి కుమార్, సూర్య, వంశీ, శివాజీ, ప్రశాంత్, శివ, శేఖర్, మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.