జనసేన భీమ్ యాత్ర 9వ రోజు

కాకినాడ సిటి: 9వ డివిజన్ గొడారిగుంట ప్రాంతంలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద బండి సుజాత ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జనసేన భీమ్ యాత్ర 9వ రోజు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకిరామారావు మాట్లాడుతూ అప్రతిహతంగా భీం యాత్రని కాకినాడ సిటిలో జరుపుతున్నామనీ, బ్యాక్ లాగ్ పోస్ట్ లని ఈ వై.సి.పి ప్రభుత్వం నియామకాలని పక్కన పడేసి దళిత నిరుద్యోగులని మోసం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులు తమ విలువైన కాలాన్ని కోల్పోతున్నారనీ ఇది నొరుతొ నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టు ఉందని ఈ ముఖ్యమంత్రికి త్వరలో బుద్ధి చెప్పే రోజుందని ఎద్దేవా చేసారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వీరమహిళలు బండి సుజాత, భవాని, సోని ఫ్లోరెన్స్, బోడపాటి మరియా, బట్టు లీల, దీప్తి, జనసేన నాయకులు ఆకుల శ్రీను, అగ్రహారం సతీష్, వలీ బషా, వాశిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.