DC vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ దశలో మరో ఆసక్తికర పోరు జరగుతోంది. అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాలను మరింత మెరుగు పర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.  తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ జట్టు ఏడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో సెకండ్ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ కూడా ఏడు విజయాలతో నెట్ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా మూడో స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకి మంగళవారం ముంబయి, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితంతో ప్లేఆఫ్‌లు ఆశలు ఆధారపడి ఉంటాయి.