ఘనంగా డాక్టర్. మిడతాన రవికుమార్ జన్మదిన వేడుకలు
- ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకలు..
- నిజమైన అనాధలు తల్లిదండ్రులని వదిలేసి వెళ్లిన కొడుకు, కూతుళ్లే.. డా.రవికుమార్ మిడతాన
విజయనగరం: రవి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు డా. మిడతాన రవికుమార్ జన్మదిన వేడుకలు బుధవారం విజయనగరం టౌన్ ప్రేమ సమాజం ఆశ్రమంలో ఉన్న అవ్వలు, తాతలు మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఆశ్రమంలోని వారంతా అనాధలు కాదు, నిజమైన అనాధలు తల్లిదండ్రులని వదిలేసి వెళ్లిన కొడుకు, కూతుళ్లే. ఈ పుట్టినరోజుని వీరందరి మధ్య భోజనం సమయంలో ఇలా కూర్చొని మాట్లాడుతూ, వాళ్లతో గడపడం చాలా సంతోషకరమైన సందర్భం.. నా జీవితంలో ఇలా ప్రతి ఏటా నా పుట్టినరోజుకి పలు ఆశ్రమంలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇలా ఏర్పాటు చేయడం నాకు చాలా సంతృప్తినిస్తుంది అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-01-at-10.00.50-PM-1024x553.jpeg)