చంద్రగిరి జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ పర్యావరణ పరిరక్షణ జనసేన పార్టీ సిద్దాంతమని చెప్పారు. తిరుపతి రూరల్ మండలంలో 36 ఎకరాలు ఓటేరు చెరువు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కబ్జా అంశాన్ని అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి లేవనెత్తారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ముందు నుండి ఉన్న ఈ చెరువు అన్యాక్రాంతం అవుతుంటే, రెవెన్యూ మరియు పోలీస్ శాఖలు ఏం చేస్తాయో అన్న ప్రశ్నను మోసారు. 2014లో గవర్నర్ పాలనలో కొందరు అవినీతి అధికారులతో కబ్జాదారులు కలిసి రికార్డులను తారుమారు చేసినట్లు పేర్కొన్నారు. 2019లో నేషనల్ హైవే పనులు ప్రారంభించబడ్డప్పుడు, చెరువు కొంత భాగం రోడ్డుకు పోయిందని, అయితే వారికెందుకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రశ్నించారు. హైవే దారిని ఆనుకుని, కలెక్టరేట్ దగ్గర ఉన్న చెరువును మట్టితో పూడ్చి వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో అని నిలదీశారు. ఒక ట్రాక్టర్ మట్టి తరలిస్తే వెంటనే సీజ్ చేసే అధికారులు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు పూడ్చడానికి తరలించిన మట్టిని తీసేసి, చెరువును సరిగ్గా ఉంచాలని, సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి అక్రమార్కులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే, ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.
Share this content:
Post Comment