*సంఘటన విషయం తెలియగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బత్తుల
*జనసేన పార్టీ తరపున క్రియాశీలక సభ్యత్వం ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తానన్న ఎమ్మెల్యే బత్తుల
*బాధితులు కుటుంబ సభ్యులకు బత్తుల ప్రగాఢ సానుభూతి..
*విద్యుత్ శాఖ నుండి ఐదు లక్షలు నష్టపరిహారం
*రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల
సీతానగరం మండలం కోటి గ్రామానికి చెందిన జనసైనికుడు పట్టాల సుబ్రహ్మణ్యం విద్యుత్ షాక్ తో దుర్మరణం చెందిన విషయం స్థానిక నాయకుల ద్వారా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు తెలుసుకొని హుటాహుటిన సీతానగరంలో ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని బాధితుడి కుటుంబ సభ్యులకు పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జన సైనికుడైన పట్టాల సుబ్రమణ్యం విద్యుత్ షాక్ తో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ కార్యాలయం నుండి క్రియాశీలక సభ్యత్వం ఐదు లక్షలు ప్రమాద బీమా అందిస్తానన్నారు. విద్యుత్ శాఖ నుండి మరొక ఐదు లక్షలు నష్టపరిహారం వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. జనసైనికుడి కుటుంబానికి అండగా ఉంటానని హామీ. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment