పది, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం సమీక్ష తర్వాతే: సురేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని రాజకీయం చేసే రీతిలో నారా లోకేశ్ వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. ఆయన వాస్తవాలు తెలుసుకుని రాజకీయం చేయాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.