*ఆందోళన వద్దు, చర్యలు తీసుకుంటాం.. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భరోసా
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు. అయితే, కొన్ని కుటుంబాలకు ఇప్పటివరకు నిధులు జమ కాకపోవడంపై ప్రజలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన ఆయన, సాంకేతిక లోపాలు లేదా విద్యుత్ ఆధారిత సమస్యల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. అవసరమైన ఆధారాలు అధికారులకు సమర్పిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. ఎన్ని మంది పిల్లలున్నా తల్లికి వందనం అందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
Share this content:
Post Comment