అక్రమంగా అరెస్ట్ అయిన జనసేన నాయకులను విడుదల చేయాలని డిమాండ్

మంగళగిరి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి కొత్త బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఆందోళన చేపట్టారు. విశాఖలో జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.