ఆప్కాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోండి ఖాళీలను బట్టి మీకు అవకాశం…

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాన్ని ప్రకటించింది. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) కార్పొరేషన్‌ను ప్రారంభించి నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట వరంలా మారింది. దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ.

ఆప్కాస్‌ ముఖ్య ఉద్దేశ్యం:

పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం.

వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.

చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి వన్‌–స్టాప్‌–షాప్‌ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.