రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసారు: గాదె

గుంటూరు జిల్లా కార్యాలయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలకు సిద్ధం అని చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిద్ధం అని సభలు పెడుతున్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటది కానీ ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని, జనసేన పార్టీ సింబల్ మీద మాట్లాడే స్థాయికి ముఖ్యమంత్రి దిగజారిపోయాడని, గ్లాస్ అనేది ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తు అని, 99 శాతం హామీలను నెరవేర్చాము అని గొప్పలు చెప్తున్నాడు. బీసీ సోదరులకు 75వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ? బీసీ కుటుంబంలో ప్రమాదవశాత్తు చనిపోతే వైస్సార్ భీమా క్రింద 5 లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ? ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేశాడా ? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు సాధించాడా మరి, వైస్సార్ రైతు భరోసా హామీలో ఆత్మహత్య చేసుకున్న రైతుకి 7 లక్షలు భీమా ఇచ్చాడా? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్యం షాపులు పెట్టి అమ్మిస్తున్నావు. యువతకి ఉద్యోగ హామీ ఇచ్చావు ఇప్పుడు ఉద్యోగాలు లేక చనిపోతున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసారుని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా. మాణిక్యాలరావు, మేకల రామయ్య యాదవ్, శిఖా బాలు, చట్రాల త్రినాథ్, కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, మధు లాల్, చింతా శివ, గోపిశెట్టీ సాయి, బాషా తదితరులు పాల్గొన్నారు.