ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో రెండు నెలల జీతం..!

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో పురుషోత్తం పట్టణం శ్రీ సత్య సాయి గ్రామర్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పట్ల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని తప్పనిసరిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా, వ్యక్తిగతంగా స్పందించినట్లు తెలియజేశారు. చిత్తశుద్ధి ఉండటం వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో రెండు నెలల జీతం చెల్లించడం జరిగిందన్నారు. మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూలత వ్యక్తం కావడం, జీతభత్యాలు చెల్లింపుకు అవసరమైన రూ.20 లక్షలు చెల్లించడం జరిగిందన్నారు. వేసవి దృష్ట్యా త్రాగినీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకి త్రాగునీరు సరఫరా అందేలా చూడాలని కోరారు. త్వరలోనే మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా, పిఎఫ్ చెల్లింపు సమస్య కూడా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment