ఉప ముఖ్యమంత్రి అనవసర వ్యాఖ్యలు మానుకోవాలి: డాక్టర్ యుగంధర్

  • ఆనందాచారికి అండగా జనసేన
  • మారేపల్లి వాసి చెంతకు జనసేన
  • నిత్యవసర సరుకులు పంపిణి చేసిన ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, వెతుకుప్ప మండలం, మారేపల్లి పంచాయతీలోని మారేపల్లి గ్రామంలో ఆనందాచారి కుటుంబాన్ని జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న సందర్శించి. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి అనవసర విషయాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. గ్రామీణ అభివృద్ధి పట్ల శ్రద్ద చూపాలని, గ్రామీణ రోడ్ల వేయడంపై చొరవ చూపాలని అగ్రహం వ్యక్తం చేశారు. స్వామి నోటి దురుసు మానుకోవాలని, ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు.. స్వామికి ఇదే చివరి ఎన్నికలని, నారాయణస్వామి అసెంబ్లీ అభ్యర్థిగా వేస్ట్ అని, ఇక చాలు, ప్రజలు కూడా విసిగి వేసారి పోయారని, బందు ప్రీతితో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని అగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు నాయ్యం జరగలేదని, వేరొకరికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసారు. బాధాతప్త హృదయులకు అండగా జనసేన అండగా ఉంటుందని తెలిపారు. కష్టాలు ఎక్కడ ఉంటుందో జనసేన అక్కడుంటుందని తెలిపారు. మారేపల్లి గ్రామ నివాసి ఆనందాచారి ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో కాలుకి బలమైన దెబ్బ తగిలి బెడ్డుకే పరిమితమై ఉండగా అండగా జనసేన నిలబడి మారేపల్లి వాసి చెంతకు జనసేన చేరి నిత్యవసర సరుకులు బియ్యము పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి ముని, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, ప్రధాన కార్యదర్శి నరేష్, జనసేన నాయకులు భాస్కర్, అజయ్, శివ, చంద్రబాబు పాల్గొన్నారు.