కుమారపురం కాలువల్లో పూడికతీత ప్రారంభం

*జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి చర్యలు

ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని కుమారపురం నీటి సంఘం పంట కాలువల్లో పూడికతీత పనులను పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ వూటా నానిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, పిఠాపురం డీసీ సోము సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు నామ నాగేశ్వరరావు, వెన్న జగదీష్‌తో పాటు పలువురు నీటి సంఘాల ప్రతినిధులు, జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు. గ్రామీణ సాగునీటి వనరుల సంరక్షణలో భాగంగా చేపట్టిన ఈ చర్యకు రైతుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Share this content:

Post Comment