అధ్వాన్నంగా మారిన శేరిలింగంపల్లి రోడ్లు

శేరిలింగంపల్లి: రోడ్డ్లు మరమ్మత్తులు చేయాలనీ చందానగర్ మున్సిపల్ ఆఫీసర్స్ కి డా. మాధవ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం అందజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. గత సంవత్సర కాలంగా రోడ్లు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోకుండా ఉండడం మరియు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వలన నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఇతర పెండింగ్ పనులను పూర్తి చేసి సమస్యని పరిష్కరించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరు బాగలేని ప్రతిచోట ఇకనుండి జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుంది అని అన్నారు. ప్రజలు పన్నులు కడుతున్నప్పుడు అడిగే హక్కు కూడా వుంటుంది అని మర్చిపోయారు. హక్కు మాత్రమే కాదు ప్రశ్నించడం మన బాధ్యత అని చెప్పారు. ఇందుకోసం ప్రజాబలం తోడైతే మన సమస్యలు త్వరితగతిన పూర్తి అవుతాయి అని చెప్పారు. అనంతరం జి హెచ్ ఎంసి అధికారులకు వినతి పత్రం అందజేశారుఈ కార్యక్రమం లో సందీప్ కసెట్టి, శ్రవణ్ కుమార్ జి.ఎస్.కే, సాయి సతీష్, హనుమంత్ నాయక్, ప్రశాంత్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.