మిరియాల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలసిన దేవ గౌడ్

తెలంగాణ, ఖమ్మం: పాల్వంచ మండలం, పాల్వంచ మండలం అధ్యక్షుడు.. దేవ గౌడ్ సోమవారం ఖమ్మం ప్రచారంలో పాల్గొని బిజెపి బలపరిచిన ఖమ్మం జనసేన అభ్యర్థి మిరియాల రామకృష్ణను కలిసి హృదయపూర్వకంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా దేవ గౌడ్ మాట్లాడుతూ మీ లాంటి యువత రాజకీయాల్లోకి రావడం చాలా అభినందనీయం అని పేర్కొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ.. గ్లాస్ గుర్తుకు ఓటెయ్యండి ప్రజల్లో ఉంటా అని తెలిపారు.