జోరందుకున్న దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారం

రాజోలు మండలం, రాజోలు గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపి మండల అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, జనసేన మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం బీజేపీ మండల అద్యక్షులు, జనసేన, టీడీపి, బీజేపీ గ్రామ శాఖ అద్యక్షులు కాటం రాజు అధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తూ రాజోలు గ్రామంలో సమస్యలు మంచినీటి సమస్య, వరద ముంపు ప్రాంతాలను ఆధునీకరణ పనులు గురించి, ఏటిగట్టు పై రోడ్డు ఆధునీకరణ , డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, తదితర సమస్యలు తెలుసుకుని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్దికి గాజు గ్లాసు ఎంపీ అభ్యర్ధి కి సైకిల్ గుర్తు పై తమ అమూల్య మైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, తెలుగు యువత, తెలుగు మహిళలు,అభిమానులు అందరూ పాల్గొన్నారు.