నిజం గెలవాలి కార్యక్రమానికి దేవర మనోహర మద్దతు

  • ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ని కలిసి నిజం గెలవాలి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియచేసిన చంద్రగిరి నియోజకవర్గ జిల్లా కార్యదర్శి దేవర మనోహర

చంద్రగిరి నియోజకవర్గం: చంద్రగిరిలో ప్రారంభమైన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారావారిపల్లెలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, నారా భువనేశ్వరిల నిజం గెలవాలని నిజమే గెలవాలి యాత్ర సంపూర్ణం విజయవంతం కావాలని అభినందనలు తెలియజేశారు. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజం గెలవాలి.. నిజమే గెలవాలి న్యాయంగా అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారని అలాగే జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడిగా కలిసి పని చేస్తామని తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క రాక్షస ముఖ్యమంత్రిని శాశ్వతంగా జైలుకు పంపే విధంగా మరియు చంద్రగిరి నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న ఈ రాక్షసు పాలన చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి గారి పాలన అంతమొందించి జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణ చేసి అతి త్వరలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ తో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా ప్రణాళికలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు సంజీవి హరి, వాక మురళి, సుబ్రహ్మణ్యం రాయల్, కిషోర్, రమేష్, వెంకట్ రాయల్, నాని, మురళి, జిల్లా కార్యదర్శి కలప రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి బీగాల అరుణ, సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య మరియు జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జనసైనికులు వీరమహిలలు పాల్గొన్నారు.