కూటమి గెలుపుతోనే ప్రజలందరికీ అభివృద్ధి-సంక్షేమం

కాకినాడ రూరల్, కరప మండలం, పెనుగుదురు గ్రామం జనసేన నాయకులు బండారు మురళి, తుమ్మలపల్లి మాచర్రావు, రెడ్డిపల్లి నారాయణ రావు, గంట నాని బాబు, వీర మహిళ గుబ్బల భవానిల అధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్యలు, సీనియర్ నాయకులు మహిళలు, పెద్దలు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలు, ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం పై విసిగి చెంది ఆ పార్టీకి రాజీనామా చేసి నరాల వీరబాబు, కొప్పిశెట్టి శ్రీనివాస్, కొప్పిశెట్టి భావన్నారాయణ రావు, మెడిసెట్టి శివల నాయకత్వంలో సుమారు 200 కుటుంబాలు నేడు కాకినాడ రూరల్ టీడీపి మాజీ ఎమ్మెల్యే, కో-ఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన-టీడీపి-బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో కూటమిలోకి చేరారు. వారందరికీ నానాజీ, అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పార్టీ కండువాలు వేసి కూటమిలోకి సాదరంగా ఆహ్వానించారు.