జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి జనసేనకే సాధ్యం: శ్రీమతి స్రవంతి రెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, యర్రమరాజు పల్లి, వెదురుకుప్పం మండలం, దామర్ కుప్పం గ్రామంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. స్రవంతి రెడ్డి జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరితో కలివిడిగా మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఉమ్మడి మేనిఫెస్టోలోని అద్భుతమైన అంశాలను సవివరంగా వివరించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి జనసేన పార్టీకే సాధ్యమని, సిద్ధాంతాలు కలిగి, రాష్ట్ర సంక్షేమం కోసమే, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటానికి నడుం బిగించిందని, ఇరు పార్టీల ఐక్యత రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసమేనని, దీనికి ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటారని, జనసేన పార్టీ దీని కట్టుబడి ఉంటుందని తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రజల కోసమే పోరాడిన పార్టీ జనసేన మాత్రమే నని కొనియాడారు. ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలోని ప్రజలను ఎవరు పట్టించుకోకపోయినా జనసేన జనం కోసమేనని, జనసేన మాత్రమే పట్టించుకుంటుందని ఉద్ఘటించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, వైసీపీ విముక్తాంధ్రప్రదేశ్ కు జనసేన కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలను, నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేసిన వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీలకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ, వీరోచితమైన పోరాటం చేసిన ఇంచార్జి కొందరు పొన్నకు ఒక అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నో పోరాటాలు చేసి, నిరసన దీక్షలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన ఘనత జనసేనకే దక్కుతుందని, నియోజకవర్గ ప్రజలు కూడా జనసేన ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి బెనర్జీ, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, కార్వేటి నగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతేష్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.