ఉమ్మడి కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి

గూడూరు: ఉమ్మడి కూటమి విజయంతోనే రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఉమ్మడి నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. చిట్టమూరు మండలంలోని కొగిలి గ్రామంలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమై అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రకృతి సంపదను యదేచ్చగా వైసిపి నాయకులు దోచుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసిపి నాయకులే చెల్లించక తప్పదన్నారు. జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు గారికి కమలం గుర్తు పై, గూడూరు నియోజకవర్గం అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు గోను క్రాంతి కుమార్, అక్బర్ కుమార్, రాము, ప్రవీణ్, వినోద్,వేణు, రాజా, సునీల్ నాగరాజు, సందీప్, రాకేష్, అవినాష్, ఆకాశ్, సుధాకర్ సాయి తదితరులు పాల్గొన్నారు.