పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే అభివృద్ధి

కొత్తవలస, ఎటువంటి అవినీతి మరక లేని పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని జనసేన పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కొత్తవలస మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో సందడిగా వేడుకలు సాగాయి. ముందుగా కొత్తవలస జంక్షన్ లోని దుర్గాదేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట పూజలు చేశారు. 51 కొబ్బరి కాయలు కొట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం కొత్తవలస జంక్షన్ లో కేకు కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 800 మంది స్థానికులు భోజనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గొరపల్లి చినబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి దృష్ట్యా పవన్ కల్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సొంత డబ్బులను ప్రజలకు పంచుతున్న అరుదైన నాయకుడని పేర్కొన్నారు. సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తీ పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాస్ పాల్గొని జనసైనికులను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లువలస శ్రీను, పిల్లా రామదుర్గా, తూరిబిల్లి విజయ్ కుమార్, బోని రామ గణేష్, దాలిబోయిన రాజు, అలమండ సురేష్, గాలి అప్పారావు, గురజాడ వెంకటేష్, అప్పలరాజు, మళ్ల రాజు, ముచ్చకర్ల శ్రీను, పెంటకోట శ్రీను, పవర్ శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు.