‘ఖ’ అంటే విష్ణుపాదము. ‘అద్రి’ అనగా కొండ.అందుకే ఈ పట్టణానికి “ఖాద్రీ” అనే పేరు వచ్చిందని కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు. కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు. శ్రీ మహా విష్ణువు నరసింహ అవతారంలో ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుణ్ణి వధించేందుకు ఎనిమిది చేతులతో ఉగ్రరూపం తో ఇక్కడే వెలిశాడని ఖాద్రీపురాణం చెబుతోంది. కదిరి కొండ ప్రాంతం (స్ధోతాద్రి) అత్యంత పుణ్యప్రదేశం ఈ ప్రదేశంలో సప్తఋషులు, దేవతలు తపస్సు ఆచరించారని ఖాద్రీపేరు తలచినంతనే మోక్షం లభిస్తుందని ఆ శ్రీమన్నారాయణుడు నరసింహస్వామి అవతారంలో భక్త ప్రహ్లాదునికి సాక్షాత్కరించిన ప్రదేశం మన ఖాద్రీపురం (కదిరి). నిలువెత్తు రూపంలో ఉన్న విష్ణుస్వరూపమే మన కదిరి కొండ. కదిరి పున్నమి సందర్భంగా కదిరి కొండపై కుమ్మర వాండ్ల పల్లి మరియు కదిరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు జ్యోతిని వెలిగించడం జరిగింది. కావున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారులు, కదిరి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్, పట్టణ ప్రముఖులు కదిరి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ మరియు జ్యోతి ప్రజ్వలన ప్రతియేటా కదిరి పున్నమి రోజున చేసే అవకాశం కల్పిస్తే బాగుంటుందని శ్రీవారి భక్తులు తరపున, హిందూ ధార్మిక సంస్థల తరపున ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
Share this content:
Post Comment