పెరిగిన విద్యుత్ చార్జీలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

సత్తెనపల్లి టౌన్: సత్తెనపల్లి నియోజకవర్గంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమం ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు జనసైనికులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. ప్రజలు ఈ ప్రభుత్వంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఇలాంటి సమయంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆకాశం అంటుతున్న సమయంలో బ్రతకటమే కష్టతరహంగా ఉన్న తరుణంలో ఈ ప్రభుత్వం ప్రజలని మూలిగే నక్క మీద తాటికాయ పడే విధంగా 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రజలపై పెద్ద పెను భారాన్ని మోపింది. రాష్ట్రంలో సహజ సంపదగా సింగరేణి బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు విధించడం విద్యుత్ చార్జీలు పెంచడం ఏంటి అని ప్రశ్నించారు. విదేశాలనుండి బొగ్గు ఎగుమతులకి అనుమతులు తెచ్చుకోవడం ఎందుకు మన రాష్ట్రంలో సహజంగా సంపద అయినటువంటి సింగరేణి బొగ్గు ఉండి కూడా నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బంది గురి చేయటం ఈ ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు విద్యుత్ చార్జీలు కరెంటు కోతలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొండివైఖరి ప్రభుత్వాన్ని ఈ సైకో ప్రభుత్వాన్ని ప్రజలు తగిన బుద్ధి రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో సమాధానం చెప్పాలని ప్రజలకి పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో గెలుపు కోసం అనేక రకాల అబద్ధాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయని ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ ప్రజల యొక్క బాధ గోడు కచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తగులుతుందని రాష్ట్ర ప్రజల కన్నీటి బాధ కూడా ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించటం ఖాయమని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకటప్పరావు గారు చెప్పడం జరిగింది ప్రజా సమస్యల తరపున పోరాడుతున్న మా గొంతులను నొక్కి విధంగా పోలీస్ యంత్రాంగం పని తీరును పోలీస్ లు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాయటం చాలా సిగ్గుచేటు అని బొర్రా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు, కౌన్సిలర్, మండల ఉపాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.