జీవో నెంబర్ ఒకటి రద్దు కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా

  • వామపక్షాల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: జీవో నెం.1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెం.1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.. ప్రజాస్వామిక హక్కులను హరించే జీవో నెంబర్ ఒకటి రద్దు చేయాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలనీ, పాలకులు ప్రజల స్వేచ్ఛను హరించే విధానాలు విడనాడాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల హక్కులను హరించే జీవో నెం.1 తీసుకొచ్చారని విమర్శించారు. తాము చేస్తున్న తప్పులను ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి ఈ జీవో ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో తమ నిరసన వ్యక్తం చేయటానికి, తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవటానికి, ర్యాలీలు, సభలు జరుపుకోవటానికి బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో వెసులుబాటు కల్పిస్తూ అనేక అంశాలు పొందుపరిచారనీ కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించే విధంగా తీసుకొచ్చిన ఈ జీవోను రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, పల్లి విజయ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, సరళ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ నాయకులు రామకృష్ణ, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, రాచప్రోలు వాసు, భూపతి, ఎం.డి.ప్రసాద్, మడుగుల మాణిక్యాలరావు, జాఫర్, బొద్దాపు గోవిందు, బాబు, రాంబాబు వీర మహిళలు గన్నవరపు ప్రియా రాణి, తుమ్మపాల ఉమాదుర్గ, కోలా సుజాత, దుర్గా బి మరియు వామపక్షాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..