రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటి దియా మిర్జా

గత ఏడాది టాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కగా, ఈ ఏడాది బాలీవుడ్‌లో పెళ్ళిళ్ల హంగామా కొనసాగుతుంది. ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇప్పటికే పెళ్లి పీటలెక్కగా రానున్న రోజులలో అర్జున్ కపూర్, రణ్‌భీర్ కపూర్ తో పాటు పలువురు ప్రముఖులు పెళ్ళి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా రెండో సారి పరిణయమాడేందుకు సిద్ధమైంది.

దియా 2004 సంవత్సరంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు. అయితే విడాకుల అనంతరం వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో దియా ప్రేమాయణం నడుపుతున్నట్టు అనేక ప్రచారాలు నడిచాయి. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 15న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్‌ రేఖీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇరువురి కుటుంబాలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం తెలుగులో ‘వైల్డ్‌ డాగ్’ మూవీలో నటిస్తున్నారు.