కష్ట జీవులు – శ్రమదాతలు – కర్షకరత్నాలు – మన అన్నదాతలు

నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండల రైతాంగానికి శ్రీమతి పతివాడ కృష్ణవేణి ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక రైతాంగానికి సన్మాన సభ నిర్వహించడం జరిగింది. అనంతరం రైతులకు లుంగీలు మాస్కులు టవల్స్ పంచడం జరిగింది. రైతులను ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. అలాగే రైతు సమస్యలపై మాట్లాడి పంటలపై సేంద్రియ ఎరువులపై జనసేన మండల నాయకులు నియోజకవర్గ నాయకులు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, విజయనగరం కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పిన్నింటి రాజారావు డెంకాడ మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి భోగాపురం అధ్యక్షులు వందనాల రమణ, పూసపాటి రేగ మండలం జలపాలి అప్పల దొర మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు దిండి రామారావు, ఊర్ల విజయ్ శంకర్, తొత్తిడి సూర్యప్రకాశ్, రామ్ లక్ష్మణులు తుమ్మి అప్పలరాజు దొర, దుక్క అప్పలరాజు, అట్టాడ ప్రమీల, కె సంతోష్, కలిశెట్టి శివ, విశ్వనాధ్ మొదలగు జనసైనికులు వీర మహిళలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.