గుమ్మడిసాని శిల్ప ఆధ్వర్యంలో పెండ్యాల శ్రీలత నాయకత్వంలో డిజిటల్ క్యాంపెయిన్

అనంతపురం, అడుగుకు ఒక గుంత గజానికి ఒక గొయ్యి అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల దుస్థితి నెలకొన్నదని జనసేనపార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు . ఈ మేరకు శనివారం జనసేనపార్టీ నాయకురాలు గుమ్మడిసాని శిల్ప ఆధ్వర్యంలో పెండ్యాల శ్రీలత నాయకత్వంలో “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మండల పరిధిలోని తాడిపత్రి – ధర్మవరం రహదారి నందు ఉన్న రోడ్లపై ఉన్న గుంతల వద్ద గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్లేకార్డ్ లను పట్టుకుని నిరసన తెలిపారు. పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని, రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి చాలా అద్వానంగా ఉందని. వీటి వల్ల ప్రతి రోజూ వందలాది మంది మృత్యు ఒడి చేరుతున్నారని అన్నారు. గుమ్మడిసాని శిల్ప మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ కోసం ప్రజల నుండి అనేక రూపాల్లో పన్నులు వసూలు చేస్తోంది, ఇవే కాకుండా రోడ్ల మరమ్మత్తుల కోసం వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి వాటి ద్వారా రోడ్లు వేయకుండా వైకాపా నాయకులు సొంత ఖాజానాలో జమ చేసుకుని ప్రజలకు గుది బండను వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని రాష్ట్రంలోని రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, పెండ్యాల చక్రపాణి, శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, భాస్కర్, హరీష్, ప్రదీప్, చంద్రమోహన్, కాశెట్టి సావిత్రి, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.