జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో నెల్లిమర్లలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

నెల్లిమర్ల, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా శనివారం నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం కొంగవాని పాలెం- బమ్మిడిపేట రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ నెల్లిమర్ల ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి మరియు టిడిపి పార్టీ కర్రోత్ బంగార్రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.