పామిడి జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

గుంతకల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు,ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ మొదలెట్టిన #GoodMorningCMSir ప్రోగ్రాంలో భాగంగా అనంతపురం జనసేన అధ్యక్షుడు టిసీ వరుణ్ మార్గనిర్దేశంతో జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, సంయుక్త కార్యదర్శి జీవన్ కుమార్ ల సూచనలతో, పామిడి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు యం ధనుంజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి,పామిడి పట్టణంలో ఎద్దుల పల్లి సర్కిల్ నందు మరియు పెన్నా నది తీరాన పోయిన వర్షానికి తెగిపోయిన వంతెన శాశ్వత నిర్మాణానికై అలాగే నెహ్రు నగర్ లోని రోడ్ల పరిస్థితి అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థ పై #ఘూదంఒర్నింగ్ఛంశిర్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డు మధ్యలో గుంతలు ఉండడం వల్ల వర్షపునీరు నిలుస్తూ వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని, అలాగే పోయిన వర్షాకాలంలో పామిడి కల్లూరు మధ్యగల పెన్నా నది రెండవ కాలువ వంతెన తెగిపోవడం జరిగిందని వాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారని ఆ రోడ్డు శాశ్వత నిర్మాణం చేపట్టాలని అలాగే పామిడి పట్టణంలోని నెహ్రూ నగర్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ పై స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి తమ సమస్యలు వివరించి వాటిపై పోరాడాలని విజ్ఞప్తి చేశారని, వీటన్నింటిపై రాబోవు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే జనసేన పార్టీ తరపున కచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్, సూర్య, ఖాజావలి, జమీర్, తాడిపత్రి సిద్ద, నాగేంద్ర, మురళి, భాస్కర్, వెంకీ, వంశీ, సాత్తర్ హాజీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.