మెప్మాలో డిజిటల్ విధానానికి శ్రీకారం

*మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ
*సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆర్పీలకు సూచన
*రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబుల పంపిణీ
*ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన
*మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి
*డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయన్న మంత్రి దుర్గేష్

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పౌర సేవలను వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రిసోర్స్ పర్సన్ల పనిభారం తగ్గించేందుకు, సేవల నాణ్యత పెంచేందుకు ట్యాబ్‌లు ఉపయుక్తమవుతాయని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని, ప్రజలకు వేగంగా సేవలు అందించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతిలోనే ప్రభుత్వం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలని అభివర్ణించిన మంత్రి దుర్గేష్, మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ట్యాబ్‌లతో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment