డిజిటల్ రంగోలీ పోస్టర్ ఆవిష్కరించిన చిల్లపల్లి

మంగళగిరి: సంక్రాంతి సందర్భంగా మంగళగిరి యాప్ వారు.. వినూత్నంగా అందరు పాల్గొనేవిధంగా “డిజిటల్ రంగోలీ పోటీని” నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు కాంటెస్ట్ పోస్టర్ ని గురువారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంటెస్ట్ ని ఉద్దేశించి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మన మంగళగిరి మరియు టోటల్ ఫ్రెష్ యాప్ వారు సంక్రాంతికి నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు జనవరి 12 నుంచి జనవరి 16 వరకు జరుగు ఈ పోటీలలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా తదితరులు పాల్గొన్నారు.