ప్రముఖ దర్శకుడు ఎన్‌.బీ.చక్రవర్తి మృతి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌.బీ.చక్రవర్తి మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  ఎన్‌.బీ.చక్రవర్తి, ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన శోభన్ బాబు గారితో 1984లో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో  ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’. రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లతో ‘కాష్మోరా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.