ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశ్రుతి.. యాక్సిడెంట్

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా రాజారాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు ఢీకొనడంతో ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనక మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే రవిశంకర్ ఎమ్మెల్సీ కవిత కారులో ఉన్నారు.