కూటమిలో క్రమశిక్షణే మార్గం

*బొబ్బేపల్లి సురేష్ నాయుడు స్పష్టీకరణ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పూర్తిస్థాయి పొత్తు ఉన్న నేపథ్యంలో, నాయకులు ఆటు ఇటు మారడానికేమీ అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒక్కో పార్టీలో పదవి రాకపోతే మరో పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు అనవసరం, అధిష్టానాలు కూడా అంగీకరించవని తేల్చిచెప్పారు. పోతు ధర్మాన్ని గౌరవిస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కూటమిలోని శాసనసభ్యులతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన నాయకులు ఒక తాటిపై నడుచుకుంటూ, క్రమశిక్షణతో కూటమి విలువలను నిలబెట్టాలని ఆకాంక్షించారు.

Share this content:

Post Comment