పాడేరు పరిధిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాడేరు నియోజకవర్గం: జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం పరిధిలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వ్యక్తిగతంగా అక్రమంగా సంపాదించాలానీ వున్న ఈ రాజకీయ వ్యవస్థలో నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కార్యకర్తలకు ఇలాంటి ఇన్సూరెన్స్ రూపంలో జనసైనికులకు, వీరమహిళలకు, పవన్ కళ్యాణ్ గారి సొంత కష్టార్జితం ఇస్తూ, పార్టీలో ఉన్న కార్యకర్తలను నాయకులకు బరోసా కల్పించి, జనసేన పార్టీ ప్రమాద బీమా పాలసీ విధానంలో జనసైనికులను, వీరమహిళలకు, అండగా నిలబడిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు చైతన్యవంతులుగా తీర్చిదిద్ది, అలాగే యువతకి బంగారు భవిష్యత్తు రావాలి అని మనస్ఫూర్తిగా తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ మానిఫెస్టో వివరించి, అలాగే క్షేత్రస్థాయి నుండి మండల స్తాయి వరకు మండల స్థాయి నుండి గ్రామస్థాయి వరకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ, అలాగే జనసేన పార్టీ బలోపేతానికి అభివృద్ధికి ప్రజలందరూ ఆశీర్వదించి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చే విధంగా ప్రజలందరూ మార్పుకి శ్రీకారం చుట్టాలని కోరారు. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్య మైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. అలాగే రైతులకు న్యాయం జరగాలంటే, అలాగే మన రాష్ట్రాన్ని మనం రక్షించుకునే బాధ్యత మనకు ఎంతైనా వుంది అని తెలిపారు. అలాగే ఈ రౌడీ రాజకీయం పోవాలంటే ఈ వైసిపి పార్టీనీ రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది ప్రజలే బుద్ది చెప్పాలని కోరారు. అలాగే ఈ వైసిపి అరాచక పాలన పోవాలంటే మన గ్రామం మన మండలము మన నియోజక వర్గం అభివృద్ధి పరంగా ముందుకు సాగాలంటే, సామాన్యుడికి న్యాయం జరగాలంటే మన ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చే విధంగా ప్రజలందరూ జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వవలసినదిగా కోరారు. అలాగే ఏ అధికారం లేకుండానే సొంత కష్టార్జితం, జనసైనికులకు వీరమహిళలకు, ప్రమాద బీమా ఇస్తు, అలాగే అనేక సమస్యల పై పోరాటం చేస్తు, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు నేను ఉన్నాను అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు 100000 అక్షరాల లక్ష రూపాయలు సొంత కష్టార్జితం ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేశారు. ఇలాంటి నిజాయితీ గల నాయకుడికి కొమ్ము కాస్తునందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందొలి మురళికృష్ణ, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సీ.హెచ్ అనిల్ కుమార్, పాడేరు వీరమహిళ, క్రియాశీలక సభ్యురాలు వంతాల ఈశ్వరమ్మ తదితరులు పాల్గొనీ కార్యక్రమం విజయవంతం చేశారు.