పెదబయలు మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాడేరు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం పెదబయలు మండలం కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విధంగా జనసేన పార్టీ ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్నారు. ప్రమాదం జరిగి గాయపడితే 50 వేలు, ప్రమాదవశాత్తు మృతిచేందితే 5 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు అందచేయడం జరుగుతుందన్నారు. క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ శ్రేణులను సమన్వయపరచుకుని జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ కళ్యాణ్ మహేష్ నాగరాజు మధు రాంబాబు పాల్గొనడం జరిగింది.