అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు మరియు క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం చేతులు మీదుగా జనసైనికులకు క్రియాశీలక సభ్యుత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా అవసరం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి.. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి అంటే క్రియాశీలక సభ్యులు గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పూర్తితో ప్రజల్లో ప్రతి రోజు మీ.. మీ గ్రామంలో ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవాకార్యక్రమాలు, కౌలురైతులకు అండగా ఉన్నారని తెలియజేయండి అని మత్స పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహాచలం, వాన కైలాష్, మత్స కృష్ణరావు, గుడివాడ రాజశేఖర్, మంతిని వ్యాగ్రీష్, చింత గోవర్ధన్ నాయుడు, బి. పి.నాయుడు, కంటు మురళి, కంటు గణేష్, తూముల మాధవ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.