ముకుంద నాయుడు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

  • యువత భవిష్యత్తుకై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ
  • జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

వనపర్తి, పెబ్బైర్ మండలం, పాతపల్లి గ్రామంలో జనసేన పార్టీ గ్రామ సమావేశం నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలతో మమేకమైన గ్రామంలోని కొందరు యువకులను పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగిందని వనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు జనసేన పార్టీ సరైన ప్రత్యామ్నాయం అని పార్టీ భావజాలం నచ్చి పవణ్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలతో కలిసి నడవటానికి యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన విధానముతో జనసేనతో కలిసి నడవడానికి సిద్ధ పడుతున్నారని ఇదే అసలైన మార్పుకు నిదర్శనమని పేర్కోన్నారు. యువత మాత్రమే కాకుండా ప్రస్తుత తరం మొత్తం జీరో బడ్జెట్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తూ సామాన్యుడు సైతం ప్రజాసేవ చేసుకునే విధంగా నీతివంతమైన రాజకీయాలకై ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రామంలోని పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ చేయడం జరిగిందనీ వారికి 5 లక్షల ప్రమాధ భీమా, 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందని పార్టీ కార్యకర్త సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్న పార్టీ ప్రజలకు ఏ సమస్యా లేకుండా చేయడానికి మొదటి అడుగు వేసే పార్టీ జనసేన అని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి బలంగా పనిచేస్తూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను చేరువగా బలోపేతం చేసుకోవాలని తెలియజేస్తూ గ్రామ యువ నాయకులు పార్టీ మండల కమిటీ సెక్రటరీ ఎమ్.రవి కుమార్ అధ్యక్షతన పాతపల్లి గ్రామ కమిటీ నియమించి యువత రాజకీయ ఆవశ్యకతను వివరించడమైనదని ముకుంద నాయుడు తెలిపారు. గ్రామ కమిటీ సభ్యులుగా అధ్యక్షుడు కావలి ఉషాన్, ఉపాధ్యక్షులు బి.చిరంజీవి, ఎండీ మహబూబ్, ప్రధాన కార్యదర్శిగా వై.శివ నాయుడు, సెక్రటరీ కె. నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.చిన్న, ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీగా పి.హరిశంకర్, ఎమ్.చందు, యూత్ అధ్యక్షులు టి.కిరణ్ నాయుడు, యూత్ ఉపాధ్యక్షుడు ఆర్.విష్ణు, యూత్ ప్రధాన కార్యదర్శిగా ఆర్.బన్నీ, కమిటి కార్యవర్గ సభ్యులుగా పి.చంటి, ఎమ్.చిన్న ఉషన్న, ఎమ్. దస్తగిరి, వినోద్ లను నియమించినట్టు పేర్కొన్నారు.