గాజువాక జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గాజువాక నియోజకవర్గం, 88 వార్డ్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన కళ్యాణ్ సూచన మేరకు 2022-23 జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమాపత్రాలు, కిట్లు, ప్రశంసా పత్రం, సభ్యత్వం, పార్టీ జెండా ఇవ్వడం జరిగింది. మరియు 154 క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన చందక చిన్నా రావు ని ఘనంగా సన్మానించడం జరిగింది.